Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని

Akhil Pavan Sadhineni

Akhil Pavan Sadhineni

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల వచ్చిన లెనిన్ తో కెరీర్ లో తొలిసారి సాలిడ్ హిట్అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు అఖిల్. దాంతో ఇప్పడు అదే జోష్ తో అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఇకపై గ్యాప్ రాకూడదని వరుస ప్రాజెక్ట్‌లను సెట్ చేస్తూ జెట్ స్పీడ్ లో సినిమాలు చేయాలని చూస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో చేతులు కలపనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

‘సేనాపతి’, ‘దయా’ వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో తన మార్కు చూపించిన దర్శకుడు పవన్ సాదినేని, ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ఆకాశంలో ఒక తార చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అఖిల్ అక్కినేని మరియు పవన్ సాదినేని కలయికలో రానున్న ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.