Site icon NTV Telugu

Akhil: అయ్యగారు ‘పరువు’ నిలబెడతారా?

Lenin, Akhil

Lenin, Akhil

అక్కినేని అఖిల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ అంటే అందరికీ గుర్తు వచ్చేది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అఖిల్‌కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది. ఆ తర్వాత చేసిన ఏజెంట్ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అఖిల్ సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఎట్టకేలకు ఇటీవల ఒక ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశాడు. లెనిన్ పేరుతో ఈ సినిమాను మురళీకృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు.

Also Read:Rajinikanth’s Coolie: ‘కూలీ’ కాదయ్యా.. కోట్లు కొల్లగొడుతున్నాడు!

గతంలో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేసిన ఆయన, ఈ సినిమాను కూడా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నాడు. అఖిల్ లెనిన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ బాగుంది. అఖిల్‌కు మరో హిట్ దొరుకుతుందేమో అని ఫ్యాన్స్‌లో ఆశలు రేకెత్తించింది. ఇప్పుడే అఖిల్‌కు పెళ్లి జరిగినందున, ప్రస్తుతానికి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే, ఈ సినిమా ఒక సున్నితమైన (సెన్సిటివ్) ఇష్యూను టచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ సినిమా పరువు హత్యల నేపథ్యంలో రాసుకున్న కథగా సమాచారం.

Also Read:Peddi : ‘పెద్ది’ క్రేజ్ మ్యాటర్స్.. అంతకు మించి!

అలాగే, సినిమా మొత్తం ఒక గుడి చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. ఇప్పటివరకు లేని విధంగా ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్‌లను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అఖిల్ గ్యాప్ తీసుకుని రాయలసీమ యాస కూడా నేర్చుకున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
ఒకవిధంగా పరువు హత్యల నేపథ్యంలో కథలు కత్తిమీద సామే అని చెప్పాలి. ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి, అక్కినేని వారసుడు ఈసారి పరువు నిలబెట్టగలడా లేదా అనేది చూడాలి.

Exit mobile version