నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ తాండవం’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపి ఆచంట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, అందులో ఒక పాత్ర అఘోరా పాత్ర. అఖండ రుద్ర సికిందర్ పేరుతో నందమూరి బాలకృష్ణ పోషించిన ఈ పాత్రకు సూపర్ అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌లో చేసిన ఫైట్స్‌తో పాటు, యాక్షన్ బ్లాక్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Also Read:Sitara – Akhanda 2 : అఖండ2లో పాత్ర కోసం సితార మొదలు సూర్య కూతురి దాకా?
అయితే, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నందమూరి బాలకృష్ణ అండ్ టీమ్ కాశీ బయలుదేరి వెళ్లినట్లుగా తెలుస్తోంది. నిజానికి, ఈ సినిమాకి సంబంధించి కాశీలో ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించాలని తొలుత భావించారు. అయితే, పలు కారణాలతో ఆ విధంగా చేయలేకపోయారు. అయినా కూడా, యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి సినిమా కంటెంట్ చూపించవచ్చని సమాచారం.
Also Read:Aadi Saikumar : షూటింగ్ లో హీరోకి గాయాలు.. అయినా వెనక్కి తగ్గకుండా?
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు, నందమూరి బాలకృష్ణ కాశీ వెళ్లి అక్కడ అఘోరాలతో ముచ్చటించనున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో అఘోరా పాత్ర పోషించిన నేపథ్యంలో, అక్కడి అఘోర సాధువులతో బాలయ్య భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే, నార్త్‌లో ప్రమోషన్స్ మరింత విస్తృతంగా చేయాలని అఖండ టీమ్ భావిస్తోంది. ఒకపక్క హాలీవుడ్ భారీ చిత్రం ‘అవతార్’ రిలీజ్ అవుతున్నా సరే, దానికి కొంత నెగిటివ్ టాక్ రావడంతో, ఆ గ్యాప్‌ను ఉపయోగించుకోవాలని అఖండ టీమ్ ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ యాక్షన్ డ్రామాను హిందీలో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. బాలయ్య మాస్ పవర్, బోయపాటి విజువల్స్ కలిసి ఉత్తరాదిలో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.