గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ‘అఖండ 2’ సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక నోట్ కూడా విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ 2’ ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచి ఇండియన్ సినిమాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు.
Also Read:Mohan Babu: ఘట్టమనేని వారసుడిని వణికించనున్న మోహన్ బాబు?
సినిమా టీజర్ అన్ని భాషల్లో సినిమాపై అంచనాలు పెంచిందని పేర్కొన్న చిత్ర బృందం, ఈ స్థాయి సినిమాకు రీ-రికార్డింగ్ చాలా జాగ్రత్తగా చేయాలని, కాబట్టి అత్యుత్తమ ప్రొడక్ట్ అందించడానికి తమకు ఇంకా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాను వీలైనంత త్వరగా తీసుకురావడానికి బృందం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. ఎంత పని చేసినా క్వాలిటీ విషయంలో, విజువల్స్ విషయంలో రాజీ పడలేమని, అది సినిమా థియేట్రికల్ ఇంపాక్ట్‌ను దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చారు. కాబట్టి, సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ‘అఖండ 2 తాండవం ఒక సినిమా కాదు, సినిమా పండుగ’ అంటూ చిత్ర బృందం ప్రకటించింది.
