నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను, ముఖ్యంగా ధర్మం, దేశభక్తి అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు.
Also Read: Boyapati Srinu : నన్ను చూసి అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు!
ఈ సినిమాతో మీరు ఒక కొత్త ఏరియాలోకి ఎంటర్ అయినట్టుగా అనిపించిందా అనే ప్రశ్నకు బోయపాటి స్పందిస్తూ…
“కొత్త పాత అని కాదు గాని, ఇదంతా మనలో మమేకమై ఉన్నది. మన ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి అద్భుతంగా చెప్పాము. మన ధర్మాన్ని మనం ఫాలో అయితే అద్భుతంగా ఉంటామని చెప్పాము. థియేటర్స్‌లో చిన్న పిల్లలు ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళ కేరింతలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది,” అని అన్నారు. దేశభక్తి, దైవభక్తి ఈ రెండు కలగలిపిన సినిమాలు లేవు, ఈ ఆలోచన ఎలా తట్టింది అనే ప్రశ్నకు బోయపాటి సమాధానమిస్తూ, ఇది అభిమానుల అంచనాల కోసమేనని స్పష్టం చేశారు.
Also Read:Akhanda 2: నేనూ మనిషినే నాకూ కోపం వస్తుంది.. అన్నీ బాలయ్యే చేశారు!
“అఖండ చూసి జనాల అంచనాలు భారీగా పెరిగాయి. తర్వాత వచ్చే సినిమా ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి అనుకున్నాము. అలాగే, మన ధర్మాన్ని చెప్పడం కూడా ఒక గొప్ప విషయం. ప్రకృతి, పసిబిడ్డ, పరమాత్మ తర్వాత దేశం, ధర్మం, దైవమే నాకు కనిపించింది. అలాంటి కథతో వస్తేనే అభిమానుల అంచనాలను అందుకోగలం. అందుకే ఆ అంశాన్ని టచ్ చేయడం జరిగింది.” ఈ సినిమాను హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలతో పోలుస్తూ బోయపాటి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
“ఇది అవెంజర్స్కి స్కోప్ ఉన్నంత సినిమా. నిజానికి అవెంజర్స్, సూపర్ మాన్, బ్యాట్ మాన్.. ఇవన్నీ కూడా పుట్టించినవి (కల్పించినవి). కానీ, మనకున్న పాత్రలన్నీ కూడా సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది. మనకు అంత ఘనమైన చరిత్ర ఉంది. ఇలాంటి సినిమాలు మనం ఎన్నైనా చేయొచ్చు. మనకు ఉండాల్సిందల్లా సంకల్పం, ఓపిక.” భారతీయ చరిత్ర, ధార్మిక అంశాలలో హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు మించిన కథాంశాలు ఉన్నాయని, వాటిని భారీ స్థాయిలో తెరకెక్కించే అవకాశం ఉందని బోయపాటి శ్రీను గట్టిగా అభిప్రాయపడ్డారు.
