బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం ఎంత పెద్ద ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, అప్పట్లోనే సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అన్నట్టుగానే, ప్రస్తుతానికి అఖండ 2 సినిమాకి సంబంధించిన సీక్వెల్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 25వ తేదీన దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ముందు భావించారు. అయితే, సినిమా అప్పటికి రిలీజ్ కావడం డౌటేనని ఎన్నో సార్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రీ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ వర్క్‌తో కూడిన సినిమా కావడంతో, అవన్నీ చేతుకొచ్చే వరకు సినిమా ఆ రోజు రిలీజ్ అవుతుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి.
Also Read:Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం?
అఖండ దర్శకుడు బోయపాటితో పాటు బాలకృష్ణ కూడా ఆ సినిమాని సెప్టెంబర్ 25కి కచ్చితంగా దింపాల్సిందేననే పట్టుదలతో ఉన్నారు. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఓటిటి డీల్స్ రేసులో జియో హాట్‌స్టార్ సంస్థ ముందుంది. ఎందుకంటే, ఈ సంస్థ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ చెప్పిన రేటు కంటే ఎక్కువగానే కొటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా జియో హాట్‌స్టార్ సంస్థ ఈ సినిమా హక్కులు దక్కించుకోవడం లాంచనమే అని అంటున్నారు. అయితే, సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బహుశా, పూర్తి అవుట్‌పుట్ వచ్చాకనే అది సెప్టెంబర్ 25కి రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
