ప్రస్తుతం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్ డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలు దుమ్ము రేపుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్ల క్రితం మొదలైన ఈ ట్రెండ్, రీసెంట్ రిలీజ్ ‘కాంతార చాప్టర్ 1’ వరకు కంటిన్యూ అవుతూనే వస్తోంది. నిజానికి, ‘కాంతార’ చూసిన తర్వాత ‘కాంతార చాప్టర్ 1’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ అంచనాను ‘చాప్టర్ 1’ అందుకోలేకపోయిందనే మాట వాస్తవం. కానీ, ‘కాంతార’ కలెక్షన్స్‌తో పోలిస్తే, ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్ మాత్రం దుమ్ము రేపుతున్నాయి. *’కాంతార’*తో పోలిస్తే కంటెంట్ కూడా ‘కాంతార చాప్టర్ 1’ లో కాస్త బెటర్‌గానే ఉంది.
Also Read:Telugu Films: ఇక అలాంటి సినిమాలు రాసే డైరెక్టర్‌లకు రక్త కన్నీరే!
ఈ నేపథ్యంలో, ఇప్పుడు రాబోతున్న ‘అఖండ’ సెకండ్ పార్ట్ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి, ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ తాండవం’ పేరుతో ఒక సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అనే విషయం మీద మాత్రం అనుమానాలు లేవు. ఎందుకంటే, ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమా అవుట్‌పుట్ అయితే అదిరిపోయింది. ఇంకా డిసెంబర్ 5వ తేదీ అంటే దాదాపుగా రెండు నెలల టైమ్ ఉంది. దీంతో, సీజీ వర్క్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది టీమ్.
Also Read:Deepika Padukone: హీరో, హీరోయిన్ ఒక్కటేనా? దీపికా!
‘కాంతార చాప్టర్ 1’ చూసిన ప్రేక్షకులే ఒక రేంజ్‌లో ఫీల్ అవుతుంటే, ‘అఖండ 2’ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమైపోతారో అంటూ, ‘అఖండ’ టీమ్ కుండ బద్దలు కొట్టి చెబుతోంది. ఖచ్చితంగా ‘అఖండ 2’ రిజల్ట్ చాలా కాలం పాటు గుర్తుంచుకునేలా ఉంటుంది అని వారు చెబుతున్నారు.
