NTV Telugu Site icon

Aishwarya: ముగ్గురు పిల్లలకు తల్లి కాబోతున్న ఐశ్వర్య

Aiswarya.jpg1

Aiswarya.jpg1

Aishwarya: కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. తన తొలి చిత్రం కాక్కాముట్టైత్రంలో ఇద్దరు పిల్లలకు నటించి ప్రశంసలు అందుకుంది. ఆమె వయసుకు తగ్గ పాత్రలు కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతారు. ప్రస్తుతం అలాంటి చాలెంజింగ్ రోల్లో మరోసారి ఐశ్వర్య నటించనున్నారు. ఒరునాళ్‌ కత్తు, మాన్‌స్టర్‌ చిత్రాలతో విజయాలను అందుకున్న దర్శకుడు నెల్సన్‌ వెంకటేశన్‌ ‘ఫర్హానా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేశ్ ముగ్గురు పిల్లలకు తల్లిగా నటిస్తున్నారు. వైవిధ్య భరిత కథాచిత్రాలు నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది.

Read Also: Avatar 2 New Records Live: అవతార్ 2 రికార్డుల మోత

ఐశ్వర్య రాజేష్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తున్న ఇందులో నటుడు రమేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్‌ స్పె షల్‌ అపిరెన్స్‌ ఇస్తున్నారు. దీనికి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతాన్ని, గోకుల్‌ పినాయ్‌ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఎప్పుడు జనసంచారంతో నిండి ఉండే ప్రాంతం చెన్నైలోని ఐస్‌హౌస్‌ అన్నారు. ఈ చిత్ర కథానాయిక నివసించే ప్రాంతం అదేనన్నారు. స్థానిక ప్యారిస్‌ ప్రాంతం కూడా ఇలానే ఉంటుందన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా నగరం ఎంతగా విస్తరిస్తున్నా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ఎదుగుదలే కనిపించదన్నారు. అలాంటి ఐస్‌హౌస్‌ ప్రాంతమే ఫర్హానా చిత్ర నేపథ్యం అన్నారు. అక్కడ ఒక పేరున్న చెప్పుల దుకాణాన్ని నిర్వహించే ఐశ్వర్య రాజేష్‌ కాలానుగుణంగా ఆ వ్యాపారం కుంటుబడడంతో ముగ్గురు పిల్లలతో కూడిన కుటుంబపోషణ నిమిత్తం ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. అలాంటి ఆమె జీవిత పయనమే ఫర్హానా చిత్రకథ అని తెలిపారు.

Show comments