NTV Telugu Site icon

G.V Prakash : హీరోయిన్ తో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Gv

Gv

తమిళ సంగీత దర్శకులలో జీవి ప్రకాష్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. తన మ్యూజిక్ తో జీవి ప్రకాష్ ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది అమరన్ అలాగే లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు జీవీ. అలాగే హీరోగాను జీవి ప్రకాష్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. కాగా గతేడాది జీవి ప్రకాష్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంన్నాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్ననాటి స్నేహితురాలు ప్రముఖ సింగర్ సైంధవితో విడాకులు తీసుకున్నారు.

Also Read : Dhanush : ఇటు హీరో.. అటు డైరెక్టర్.. శెభాష్ ‘ధనుష్’

2013 లో ఒక్కటైనా ఈ జంటకు 2020లో ఆడపిల్లకు జన్మనిచ్చారు. అయితే 11 ఏళ్ల వీరి వివాహ బంధానికి ముగింపు పలుకుతూ గతేడాది పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. కాగా జివి ప్రకాష్ కు సంబంధించి కొన్నాళ్లుగా ఓ న్యూస్ చెన్నై సిర్కిల్స్ వినిపిస్తుంది. జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచ్ లర్ సినిమాలోని హీరోయిన్ దివ్య భారతీతో ప్రేమలో ఉన్నాడని కొన్నాళ్లుగా ఈ జోడి డేటింగ్ ఉందని త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో స్పందించిన జీవి రూమర్స్ ను ఖండించాడు. జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ‘నేను దివ్య భారతి కలిసి నటించినంత మాత్రాన మా మధ్య ఎదో ఉందనుకోవడం పొరపాటు. నేను దివ్య మంచి ఫ్రెండ్స్. సినిమా షూట్ లో మాత్రమే కలుస్తాం. అంతకు మించి బయట మేము ఎక్కడ కనీసం కలుసుకోము. మీడియాలో ఏవేవో రాస్తుంటారు చూసి నవ్వుకొని వాటిని వదిలీయేమని దివ్య కు చెప్తాను’ అని అన్నారు.