Gouri Priya: మా అమ్మ బతికి ఉంటే.. నా సక్సెస్ చూసేది.. గౌరిప్రియ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమాని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. సాయి రాజేష్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరోయిన్ గౌరీ ప్రియ ఎమోషనల్ అయింది. ఆమె మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నిజంగా కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ డే ఇది నాకు. మా అమ్మ ఉండింటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ మా అమ్మ రూపంలో విశాల గారు గాని, ప్రమోదిని గారు గాని అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇందాక వచ్చిన వెంటనే దే వర్ లైక్ “మీ అమ్మ ఉంటే షి వుడ్ హావ్ ఫెల్ట్ సో హ్యాపీ. నీకు ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది. తను చూస్తుంటే చాలా బాగుండేది” అని మీరు అనుకుంటున్నారేమో! కానీ తను చూస్తోంది, తన వల్లే నాకు ఈ పేరు వస్తుంది అనేది నా ఫీలింగ్. మై డాడ్ ఈజ్ ఆల్సో దేర్. హాయ్! థాంక్యూ సో మచ్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది చేయలేను.
నిన్నటి నుంచి ఫోన్ మోగిపోతుంది. ఎందుకు మోగుతోంది? ఎందుకు మెసేజ్‌లు వస్తున్నాయి? ఎందుకు ఇంతలా చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. కొంచెం సేపు ఒక బ్లాంక్ లో ఉన్నాను అన్నమాట. నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్, మా అమ్మ బ్లెస్సింగ్స్… మా అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటారు. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యు, అంతే! నీ పెంపకానికి నేను పడే కష్టం ఇది, థాంక్యూ సో మచ్. జూలై 23 మా సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. నిన్న జూలై 24 మా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే రెస్పాన్స్ కానీ, కలెక్షన్స్ కానీ మామూలుగా లేవు. అండ్ థియేటర్ విజిట్స్ అంతా అయిపోయిన తర్వాత థియేటర్స్ లో… మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఒకలాగా, లేకపోతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఒకలాగా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం అనేది కాదు కానీ, ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఒక సినిమాని ఎంజాయ్ చేయడం, అది కూడా మా సినిమా/మన సినిమా అవ్వడం అనేది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అని అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?