Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి ఖుష్బూ, ప్రముఖ దర్శకుడు సుందర్ సిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఈ స్టార్ దంపతుల పెద్ద కుమార్తె అవంతిక వివాహం నేడు గోవాలోని ఒక లగ్జరీ స్టార్ హోటల్లో అత్యంత వైభవంగా జరుగుతోంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే సింపుల్‌గా ఈ వేడుక ముగుస్తుందని మొదట ప్రచారం జరిగినప్పటికీ.. ప్రస్తుతం గోవా నుండి లీక్ అవుతున్న ఫోటోలు, ఇండస్ట్రీ అప్డేట్స్ చూస్తుంటే ఇదొక రేంజ్ డెస్టినేషన్ వెడ్డింగ్లా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో “ఖుష్బూ కుమార్తె పెళ్లికి ఎవరెవరు వెళ్లారు?” అనే చర్చ ట్రెండింగ్‌గా మారింది.
గత కొన్నేళ్లుగా తన వెయిట్ లాస్ జర్నీ, అద్భుతమైన మేకోవర్‌తో వార్తల్లో నిలిచిన అవంతిక.. ఇటీవలే వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది. పవిష్ సరసన ‘అటాకర్’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న తరుణంలోనే ఈ పెళ్లి వార్త బయటకు రావడం అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడిని అవంతిక చాలా కాలంగా ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల సమ్మతంతోనే గోవా బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న టైంలోనే అవంతిక లైఫ్ ఇంత స్పీడ్‌గా నెక్స్ట్ లెవెల్‌కి మూవ్ అవ్వడం నిజంగా క్రేజీ సడన్ సర్ప్రైజ్ అనే చెప్పాలి.
Also Read
- Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
- Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
సినీ స్టార్ల హడావిడి లేకుండా ప్రశాంతంగా ఫ్యామిలీ ఈవెంట్‌లా చేసుకోవాలని భావించినప్పటికీ.. ఖుష్బూ-సుందర్ సి దంపతులకు ఉన్న ఇండస్ట్రీ పరిచయాల వల్ల టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు గోవాకు క్యూ కట్టారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున తన భార్య అమలతో కలిసి ఇప్పటికే గోవాలో ల్యాండ్ అయ్యారు. అక్కడ జరిగిన ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఖుష్బూతో నాగ్ ఎంతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న విజువల్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వివాహానికి హాజరైనట్టు సమాచారం. ఖుష్బూకు అత్యంత ఆప్తమిత్రురాలైన సౌత్ క్వీన్ త్రిష కూడా ఈ పెళ్లి వేడుకలో మెరవడానికి గోవా వెళ్లినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!