Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!

Goa Nagarjuna

Goa Nagarjuna

సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి ఖుష్బూ, ప్రముఖ దర్శకుడు సుందర్ సిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఈ స్టార్ దంపతుల పెద్ద కుమార్తె అవంతిక వివాహం నేడు గోవాలోని ఒక లగ్జరీ స్టార్ హోటల్‌లో అత్యంత వైభవంగా జరుగుతోంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే సింపుల్‌గా ఈ వేడుక ముగుస్తుందని మొదట ప్రచారం జరిగినప్పటికీ.. ప్రస్తుతం గోవా నుండి లీక్ అవుతున్న ఫోటోలు, ఇండస్ట్రీ అప్‌డేట్స్ చూస్తుంటే ఇదొక రేంజ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో “ఖుష్బూ కుమార్తె పెళ్లికి ఎవరెవరు వెళ్లారు?” అనే చర్చ ట్రెండింగ్‌గా మారింది.

గత కొన్నేళ్లుగా తన వెయిట్ లాస్ జర్నీ, అద్భుతమైన మేకోవర్‌తో వార్తల్లో నిలిచిన అవంతిక.. ఇటీవలే వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. పవిష్ సరసన ‘అటాకర్’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న తరుణంలోనే ఈ పెళ్లి వార్త బయటకు రావడం అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడిని అవంతిక చాలా కాలంగా ప్రేమిస్తున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల సమ్మతంతోనే గోవా బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. కెరీర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న టైంలోనే అవంతిక లైఫ్ ఇంత స్పీడ్‌గా నెక్స్ట్ లెవెల్‌కి మూవ్ అవ్వడం నిజంగా క్రేజీ సడన్ సర్ప్రైజ్ అనే చెప్పాలి.

సినీ స్టార్ల హడావిడి లేకుండా ప్రశాంతంగా ఫ్యామిలీ ఈవెంట్‌లా చేసుకోవాలని భావించినప్పటికీ.. ఖుష్బూ-సుందర్ సి దంపతులకు ఉన్న ఇండస్ట్రీ పరిచయాల వల్ల టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు గోవాకు క్యూ కట్టారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున తన భార్య అమలతో కలిసి ఇప్పటికే గోవాలో ల్యాండ్ అయ్యారు. అక్కడ జరిగిన ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఖుష్బూతో నాగ్ ఎంతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న విజువల్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వివాహానికి హాజరైనట్టు సమాచారం. ఖుష్బూకు అత్యంత ఆప్తమిత్రురాలైన సౌత్ క్వీన్ త్రిష కూడా ఈ పెళ్లి వేడుకలో మెరవడానికి గోవా వెళ్లినట్లు తెలుస్తోంది.