కన్నడ నటి భావన రామన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు, అది కూడా కవలలకు జన్మనివ్వబోతున్నట్లు, ప్రస్తుతం ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు, తన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
Also Read : War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్
భావన మాట్లాడుతూ.. ‘ నాకు 20 లో, 30 లో తల్లి కావాలన్న ఆలోచన రాలేదు. కానీ 40 వ సంవత్సరానికి చేరుకున్నప్పుడు ఆ కోరిక బలంగా వచ్చింది. అయితే అవివాహితగా తల్లి కావాలనుకోవడం అనేక సవాళ్లతో కూడుకున్న నిర్ణయం. చాలా IVF సెంటర్లు నన్ను సింగిల్ అని తిరస్కరించాయి. కానీ డాక్టర్ సుష్మ నాకు అండగా నిలిచారు. మొదటి ప్రయత్నంలోనే గర్భం దాల్చాను. ఈ విషయం లో నా కుటుంబం, తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు. నా పిల్లలకు తండ్రి లేకపోవచ్చు. కానీ వాళ్లకు ప్రేమ, కళ, సంస్కృతి, ఆత్మవిశ్వాసంతో నిండిన జీవితం ఇవ్వగలను. వాళ్లు తమ మూలాల పట్ల గర్వంగా ఉండేలా పెంచుతాను” అని భావన తెలిపింది. ఇది అభిమానులకే కాదు, సమాజానికీ ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్. ఒక మహిళ తన నిర్ణయంపై ఎంతగానో నమ్మకంతో ముందుకు సాగితే, ఎలా విజయాన్ని సాధించవచ్చో భావన రామన్న మరోసారి రుజువు చేశారు.