Sunil: మంగళం శ్రీను పాత్ర వెనుక ఇంత కథ ఉందా..? సునీల్ షాకింగ్ రివీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ (Sunil).. ఈ పేరు విన్నా, ఆయన మార్క్ కామెడీ టైమింగ్ గుర్తుకువచ్చినా సగటు తెలుగు సినీ ప్రేక్షకుడి ముఖంలో తెలియకుండానే నవ్వు వికసిస్తుంది. కమెడియన్‌గా వందలాది చిత్రాలలో ఐకానిక్ పాత్రలతో మెప్పించి, ఆ తర్వాత హీరోగా సత్తా చాటిన సునీల్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే ఇటీవల మలయాళంలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘కాటాలన్’ (Kaatalan) మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప’ (Pushpa) లో తనకు విలన్ ఛాన్స్ రావడంపై సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కమెడియన్‌గా జనాలను నవ్వించే సునీల్‌ను ‘పుష్ప’ చిత్రంలో అత్యంత క్రూరమైన గ్యాంగ్‌స్టర్ ‘మంగళం శ్రీను’ క్యారెక్టర్లో చూసి ఇండస్ట్రీ అంతా షాక్‌కు గురైంది. అసలు ఒక కమెడియన్లో సుకుమార్ అంతటి పవర్ఫుల్ విలనిజం ఎలా చూశారు? అనే ప్రశ్నకు సునీల్ ఈ ఈవెంట్లో స్టేజ్ పైన పూర్తి క్లారిటీ ఇస్తూ.. ‘లాక్డౌన్ సమయంలో ఒకరోజు నేను దర్శకుడు సుకుమార్‌తో మాట్లాడుతూ..
Also Read
డార్లింగ్, నేను ఇకపై కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా, నాలోని నటుడిని నిరూపించుకునే వేరే వైవిధ్యమైన క్యారెక్టర్లు కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను అలా చెప్పిన రెండు రోజులకే సుకుమార్ నాకు ఫోన్ చేశాడు. ‘పుష్ప సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్‌కు నిన్ను అనుకుంటున్నాను. అది ఫుల్ లెంగ్త్ విలన్ రోల్. కానీ ఒక కండిషన్.. ఆ పాత్రలో నువ్వు అస్సలు కామెడీ చేయకూడదు. కనీసం నీ బాడీ కూడా ఎక్కువగా మూవ్ కాకూడదు. కేవలం నీ కళ్లు, ముఖంలో మాత్రమే విలనిజం పలకాలి’ అని చెప్పాడు. ఆ క్యారెక్టర్ వినగానే నాకూ పెద్ద షాక్ తగిలింది. ఆ తర్వాత లుక్ టెస్ట్ కోసం వారు కాస్ట్యూమ్స్ పంపితే.. ఒక్కో డ్రెస్ వేసుకుని ఫొటోలు దిగి పంపించాను. అలా మంగళం శ్రీను క్యారెక్టర్‌కు సెలెక్ట్ అయ్యాను. ఆ విలన్ లుక్ పర్ఫెక్ట్గా రావడం కోసం పుష్ప సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ నేను నా ఫోర్ హెడ్ (ముందు తల భాగం) షేవ్ చేసుకునేవాడిని’ అని సునీల్ ఆనాటి కష్టాన్ని గుర్తుచేసుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!