Devi Sri Prasad Says Pushpa 2 1st Half is Mind Blowing: అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప-2 ది రూల్ కోసం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు ఇండియన్ సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రైజ్ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాను ఒకరకంగా చెక్కుతున్నాడు సుకుమార్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు అనూహ్య స్పందన కూడా వచ్చింది. డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అయితే అందరి ఊహించిన దానికంటే అద్భుతంగా సినిమా వుండబోతుందని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Jani Master: జానీ మాస్టర్ కి మరో షాక్?
సోమవారం హైదరాబాద్‌లో దేవిశ్రీప్రసాద్ లైవ్ కన్‌సర్ట్ గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అయన మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ”పుష్ప-2 ఇటీవల ఫస్ట్ హాఫ్ చూశాను. మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. పుష్ప కథను ఇప్పుడే కాదు స్క్రిప్ట్ విన్నప్పుడే నేను లిరిక్ రైటర్ చంద్రబోస్ మూడు సార్లు క్లాప్స్ కొట్టాం, సుకుమార్ కథ చెబుతున్నప్పుడు ఇక్కడ ఇంటర్వెలా.. ఇక్కడ ఇంటర్వెలా అని మేము అంటున్నాం అంటే అంతలా మాకు ప్రతి సీన్ కిక్ ఇచ్చిందని అన్నారు. ప్రతి సీన్‌లోనూ ఎంతో ఎనర్జీ ఉంటుందని పేర్కొన్న అయన సినిమా చూసినప్పుడు సుకుమార్ కథను రాసిన విధానం సినిమాను తెరకెక్కించిన తీరు, అల్లు అర్జున్ నటించిన విధానం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందనున్నారు. సినిమా నెక్ట్స్ లెవల్ సినిమా అంతే.. ఇక ఫస్ట్ హాఫ్ అయితే సూపర్‌గా ఉందని అన్నారు. ఇక మొన్ననే పుష్ప-2 మేకర్స్ ఫస్ట్‌హాఫ్‌ను లాక్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఇక తమ హీరో సినిమాకేం ఇబ్బంది లేదని అల్లు అర్జున్ ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు.