Shivaji Raja: శివాజీ రాజా అప్పుడలా.. ఇప్పుడిలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivaji Raja: టాలీవుడ్ ప్రేక్షకులకు శివాజీ రాజా పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, హీరోగా ఎన్నో వందల సినిమాలో నటించారు ఆయన. శివాజీ రాజా కాస్తా బొద్దుగా ఉంటారు. గతేడాది ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన బాగా చిక్కిపోయి దర్శనం ఇచ్చారు. ఇలా ఆయనను చూసి అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయను గురించి చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. కొంతకాలం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చినప్పటికీ తన ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ లేదు. అలా మీడియాకు దూరంగా ఉన్న శివాజీ రాజా జులై నెలలో తన తనయుడు వినయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘వేయు శుభములు కలుగు నీకు’ సినిమాలోని ఓ సాంగ్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన బరువు తగ్గి చిక్కిపోయి కనిపించడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ఏంటి ఆయన ఇలా అయిపోయారు, శివాజీ రాజాకు ఏమైందంటూ ఫాలోవర్స్, అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చాక బరువు తగ్గిపోయారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Also Read
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
- Ramayana: "డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?".. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
- Simbu - Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
- RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
ప్రస్తుతం ఆయన పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారని ఈ క్రమంలో ఎక్కువగా బయటకు రావడం కానీ మీడియాతో మాట్లాడటం కానీ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. తాజాగా నిర్మాత సురేష్ కొండేటితో కలసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన తన పూర్వ రూపాన్ని దక్కించుకున్నట్లు కనిపిస్తున్నారు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అవుపిస్తున్నారు. మొదట్లో ఉన్నట్లు కాస్తంత బొద్దుగా తయారయ్యారు. ఈ ఫోటో చూసిన శివాజీ రాజా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా శివాజీ రాజా 35 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. తన కామెడియన్‌గా, విలన్‌గా, హీరోగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అలా 400పైగా చిత్రాల్లో నటించిన ఆయన కొంతకాలం మా ఆధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య రిత్యా నటనకు బ్రేక్ ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..