యువతను చెడుదోవ పట్టించే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందు టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో హీరో విజయ్ దేవరకొండ పాటు రానా ,మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై ఈడి కేసులు నమోదు చేసింది. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి ఈ కేసును విచారిస్తోంది.
Also Read : Nithya Menen : తమిళంలో మరో హిట్ కొట్టేసిన నిత్యామీనన్.. నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్
పది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ కి నోటీసులు ఇచ్చింది ఈడి. ఈడీ నోటీసులు ఇచ్చిన నేపధ్యంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ నేడు ఈడీ ఎదుట హాజరయ్యాడు. జుమ్మి రమ్మి అనే బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేసారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు మూడు నెలల ముందు అలాగే ప్రమోట్ చేసిన తరువాత ఆరు నెలల వరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ లను తన వెంట తీసుకొని వెళ్ళాడు ప్రకాష్ రాజ్. బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ లను ఈడీ అధికారులకు అందజేసిన ప్రకాశ్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ తరపున వచ్చిన అడ్వకేట్ ను విచారణ గదిలోకి అనుమతించలేదు ఈడీ అధికారులు. ఈడీ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్ కు అధికారులు ప్రశ్నల వర్షన్ కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసేందుకు ఎంత తీసుకున్నారు. సమాజానికి హానికలిగించే అటువంటి యాప్స్ పట్ల దూరంగా ఉండాలని సూచించకుండా ప్రమోట్ చేసారంటే అందుకు ప్రతిఫలంగా భారీగానే ఇచ్చి ఉంటారు వంటి విషయాలను ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు.