బాల నటుడిగా, యువ హీరోగా, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించిన కౌశిక్ బాబు కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా నియమితులయ్యారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. అయ్యప్ప మహత్యం, షిరిడీ సాయి, శ్రీ రాఘవేంద్ర స్వామి వంటి చిత్రాల్లో నటించిన కౌశిక్ బాబు బాల నటునిగా నంది పురస్కారం అందుకున్నారు. ప్రముఖ పాత్రికేయుడు శ్రీ విజయబాబు తనయుడే కౌశిక్ బాబు. విజయ బాబు ఫిల్మ్ క్రిటిక్ సభ్యులు కూడా.