మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా “ఆచార్య”. హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సోషల్ మెసేజ్ మూవీ. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. చరణ్ సిద్ధ పాత్రలో నటించనున్నాడు. ఆయన ప్రియురాలిగా పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. బుధవారం రోజునే సినిమా షూటింగ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
Read Also : ఆగష్టు 15న వరుణ్ తేజ్ మెగా అప్డేట్
అందులో రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని వెల్లడించారు. టాకీ పార్ట్ ను పూర్తి చేసుకున్న “ఆచార్య” త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ వార్త ప్రచారం అవుతోంది. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగుతుందని, కాకపోతే ఇంతకుముందు ప్రకటించిన సినిమాల కంటే 10 రోజుల ముందుగా రాబోతోందని అంటున్నారు. 2022 జనవరి 7న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది అని సమాచారం.
