ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు.ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ వంటి మూడు భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది.
జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై వచ్చింది ఆయ్. ఆగస్టు 15న పెద్ద సినిమాలతో పోటీగా ఎందుకు కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయమని అప్పట్లో నిర్మాతకు కొందరు సూచించారు. కానీ అప్పటికే మరో చిన్న సినిమా అయిన కమిటీ కుర్రోళ్లు మంచి హిట్ సాధించడంతో కంటెంట్ బాగుంటే తప్పక ఆదరిస్తారని నిర్మాతలు ధైర్యంగా ముందడుగు వేశారు దొరికినన్ని థియేటర్లలో విడుదల చేసారు. కథ, కథనం బాగుంటే చిన్న సినిమాలను టాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మి విడుదల చేయగా నిర్మాతల నమ్మకం నిజమైంది. విడుదలైన 16 రోజులకు గాను 16. 40 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి నిర్మాత బన్నీ వాసుకు లాభాల పంట పండించింది. విజయవంతంగా మూడవ వారంలో అడుగుపెట్టి డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. కాగా ఆయ కలెక్షన్స్ లో 25% డబ్బును ఏపీ వరద భాదితుల సహాయార్ధం జనసేన పార్టీ ద్వారా అందిస్తామని బన్నీ వాసు ప్రకటించిన సంగతి తెలిసిందే.