ఒక్కోసారి “షూట్”లో పని జరగటానికి చిన్న చిన్న చిట్కాలు భలే పనికొస్తాయి అంటూ ఓ ఆసక్తికర విషయం బయట పెట్టారు దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్. ఆయన దర్శకత్వంలో వచ్చిన “ఆడుతూ పాడుతూ” సినిమాలో ఓ ఎలుక సునీల్ “పాస్‌పోర్ట్” ని తినేస్తుంది. ఆ ఎలుక మళ్ళీమళ్ళీ అతనికి కనిపించి రెచ్చగొడుతుంటే శివాలెత్తిపోతుంటాడు, ఈ సీన్స్ అన్నీ సినిమాలో బాగా పండాయి. ఇప్పటికీ ఆ సీన్స్ వస్తే అప్రయత్నంగా నవ్వు వస్తుంది. అయితే సినిమా షూటింగ్ సమయంలో ఎలుక పాస్‌పోర్ట్ తినే షాట్ తియ్యాలి. ఎలుకని పాస్‌పోర్ట్ బుక్ ముందు పెట్టి ఎదురుగా కెమేరా పెట్టుకుని సైలెంట్ గా కూర్చున్నామని ఆయన అన్నారు. ఎంత సేపటికీ ఎలుక పాస్‌పోర్ట్ వైపు మూతికూడా పెట్టదే…. ఎన్ని ఎలుకలను మార్చినా ఎంతసేపు వెయిట్ చేసినా అదే పరిస్థితి.
Pawan Kalyan: చిరంజీవి ముసుగు కట్టుకొని సినిమా థియేటర్ కి వెళ్ళేవాడు!
ఈ లోగా మా కెమేరామెన్ శంకర్ గారికి ఓ ఐడియా వొచ్చింది. ప్రొడక్షన్‌లో ఫుడ్ సెక్షన్ నుండి ఓ “కాబేజి” తెప్పించి పల్చటి చిన్న ముక్కలు చేసి బుక్ లో పేజీల మధ్యమధ్యలో పెట్టి ఎలుకని అక్కడపెట్టగానే కాబేజీ ముక్కల్ని కసకసా తినటం మొదలుపెట్టింది. షాట్ ఓకే అయ్యింది. కాబేజీకలర్ పేపర్స్‌కలర్‌లో కలిసిపోవటంతో ఎలుక పాస్‌పోర్ట్ నే తింటున్నట్టు కనిపిస్తుంది సినిమాలో. “సినిమా అంతా ఎలుక మీద అన్ని సీన్స్ వున్నాయికదా అదంతా గ్రాఫిక్సేకదా” అని ఇప్పటికీ కొంతమంది అడుగుతుంటారు. అంత బడ్జెట్ మాకెక్కడిది. ప్రతి షాట్‌లోనూ ఉన్నది నిజమైన ఎలుకే. కాకపోతే సినిమాలో ఒక ఎలుకగా కనిపిస్తుందికానీ షూట్‌లో చాలా ఎలుకలు వాడవలసివొచ్చింది. షాట్లో పెట్టి లైట్స్ ఆన్ చెయ్యగానే ఒక్కో ఎలుకా తుర్రున పారిపోయేదని దేవీప్రసాద్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.