కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి కానీ భారీ బడ్జెట్ చిత్రాలు, బాడీపై ఎక్స్ పరిమెంట్స్ చేయనక్కర్లేదని కాస్త ఆలస్యంగా బోదపడింది విక్రమ్‌కు. అందుకే నెక్ట్స్ ఫిల్మ్స్ విషయంలో ప్రయోగాల జోలికి వెళ్లకుండా కథనే నమ్ముకుంటున్నాడు. వీర ధీర శూరన్ 2తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విక్రమ్ స్పీడ్ పెంచాడు. అందులోనూ హిట్ దర్శకులతో జర్నీ షురూ చేశాడు. మండోలా, మావీరన్ దర్శకుడు మడోన్నా అశ్విన్.. చియాన్‌తో 63ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫీల్ గుడ్ మూవీలతో పాపులరైన ప్రేమ్ కుమార్‌ను లైన్లో పెట్టాడు.
Also Read : Tollywood : ఈ శుక్రవారం డైరెక్ట్ రిలీజ్ vs రీ రిలీజ్ సినిమాలు
96తో గుండెల్ని హత్తుకుపోయే లవ్ స్టోరీని అందించిన ప్రేమ్ కుమార్ .. ఆ తర్వాత కుటుంబ బంధాల గురించి తెలియజేస్తూ తెరకెక్కించిన సత్యం సుందరం కూడా సూపర్ హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ మూవీ డిసెంట్ హిట్ అందుకోవడమే కాదు సింపుల్ స్టోరీతో కథ నడిపించిన తీరును అప్లాజ్ చేయకుండా ఉండలేకపోయింది సౌత్ ఇండస్ట్రీ. వీటి తర్వాత 96 సీక్వెల్ తీయాలని ప్లాన్ చేయగా ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టడంతో చియాన్‌తో నెక్ట్స్ మూవీ ప్లాన్ చేశాడు ప్రేమ్. విక్రమ్ 64ని ప్రేమ్ కుమార్ హ్యాండిల్ చేయడం ఇప్పుడు కోలీవుడ్ హాట్ టాపిక్. కామ్ గోయింగ్ చిత్రాలతో పాపులరైన ప్రేమ్ వర్సటాలిటీకి పెట్టిందీ పేరైన చియాన్ ను డీల్ చేయగలడా అన్నదే డౌట్. కానీ దర్శకుడ్ని కూడా తనకు అనుకూలంగా మార్చేస్తున్నాడు విక్రమ్. ఈసారి యాక్షన్ అండ్ థ్రిల్లర్ జోనర్‌తో కొత్తగా ట్రై చేయబోతున్నాడు 96 డైరెక్టర్. ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ తెరకెక్కిస్తోంది. మరీ ఇప్పటి వరకు ప్రేమ కథలను డీల్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ సారి చియాన్‌ను ఎలా చూపించబోతున్నాడో చూడాలి