శ్రీలీల సక్సెస్ రేష్యోను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు బీటౌన్. అది ఓకే కానీ కనీసం బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిజల్ట్ తేలేంత వరకు కూడా వెయిట్ చేయడం లేదు. ఆఫర్లు ఇస్తూనే ఉంది. సైఫ్ అలీఖాన్ సన్ ఇబ్రహీం అలీఖాన్‌తో మడాక్ ఫిల్మ్స్ ఓ మూవీని ఫిక్స్ చేసినట్లు టాక్. టీ సిరీస్, మడాక్ ఫిల్మ్స్ తో పాటు కరణ్ జోహార్ సినిమాలోనూ ఛాన్స్ ఇచ్చేశాడట. అప్పుడెప్పుడో షెడ్డుకు వెళ్లిపోయిందనుకున్న దోస్తానా2లో జాన్వీ ప్లేసులో రీ ప్లేస్ చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో ధర్మ ప్రొడక్షన్‌లో టూ ఫిల్మ్స్ అగ్రిమెంట్ చేయించుకున్న కరణ్, తు మేరీ మే తేరా తర్వాత దోస్తానా2కి ఫిక్స్ చేశాడని బాలీవుడ్ టాక్. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే లవర్ అని రూమర్ వచ్చిన బాయ్‌ఫ్రెండ్ హీరోతోనే శ్రీలీల మరోసారి జోడీ కట్టే ఛాన్సుంది .
Also Read : WAR 2 vs Coolie : బడా నిర్మాత చేతుల్లోకి కూలీ నార్త్ రిలీజ్.. వార్ 2 కి గట్టి షాక్.
వైరల్ వయ్యారీ క్రేజ్‌కు పడిపోయిన బీటౌన్ మరో బిగ్ ప్రాజెక్ట్ ను శ్రీలీలకే కట్టబెట్టిందని తెలుస్తోంది. రణవీర్ సింగ్‌తో నటించే గోల్టెన్ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాబీడియోల్ కూడా ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పడు ఈ సినిమాలో కూడా శ్రీలీల కన్ఫర్మ్ అయింది. టాలీవుడ్ లో వరుస సినిమాలు డిజాస్టర్స్ అవుతున్న కూడా బాలీవుడ్ మాత్రం పిలిచి మరి ఛాన్స్ లు ఇస్తోంది. అయితే శ్రీలీల బాలీవుడ్‌లో బిజీ అయినప్పటికీ జస్ట్ గెస్ట్‌గానే వెళుతుందట కానీ సెటిల్ అయ్యే ఉద్దేశం లేదంటోంది. మరి ఓ బాలీవుడ్ సినిమా కోసం అక్కినేని అఖిల్ సరసన నటించిన లెనిన్ సినిమా నుండి వయ్యారి ఎందుకు తప్పుకుందో అంటే మాత్రం చెప్పదు.