Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News 8 Vasanthalu Controversy Phanindra Narsetti Response

Phanindra Narsetti : కాశీ ‘కబేళా’లో బ్రాహ్మణుడితో రేప్ అటెంప్ట్.. మా తప్పేం లేదంటున్న డైరెక్టర్!

Published Date :June 23, 2025 , 9:52 pm
By Bhargav Chaganti
Phanindra Narsetti :  కాశీ ‘కబేళా’లో బ్రాహ్మణుడితో రేప్ అటెంప్ట్.. మా తప్పేం లేదంటున్న డైరెక్టర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన 8 వసంతాలు థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలోని ఒక సీన్ విషయంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా సక్సెస్ మీట్‌లో సదరు జర్నలిస్ట్ సినిమా టీమ్‌ని ప్రశ్నించారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణుడి వేషంలో ఉన్న ఒక వ్యక్తి రేప్ చేసేందుకు ప్రయత్నించడం, దానికి ముస్లిం వ్యక్తులు సహకరించడం, అది కూడా కబీర్‌లో రేప్ అట్టెంప్ట్ చేయడం లాంటి విషయాలు అభ్యంతరకరమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, సదరు సక్సెస్ మీట్‌కి హాజరుకాని దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ఈ విషయం మీద సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Also Read:Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘Haunted’ వ్యాఖ్యలపై కాజోల్ U Turn

సనాతన ధర్మానికి, వేద గ్రంథాలు రాయడంలో ఎంతో కృషి చేసిన బ్రాహ్మణ కమ్యూనిటీ అంటే తనకు చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. అయితే, జర్నలిస్టులు ఎందుకు సినిమాలోని సీన్ విషయంలో ఒక కులాన్ని ఆపాదిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. మనుషులు తమ స్వభావం, ప్రవృత్తి రీత్యా క్రైమ్ చేస్తారు, అలా అని వారి కులం ప్రకారం కాదని అన్నారు. అందుకే తాను సీన్‌లో వేర్వేరు సామాజిక స్థితిగతులకు చెందిన వారు ఒక క్రైమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించానని, ఏ కులాన్ని ఇక్కడ టార్గెట్ చేయలేదని వివరించారు.

Also Read:Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?

అది ఒక కబేళా కాబట్టి దానికి సంబంధించిన క్యారెక్టర్‌లను రాసుకున్నానని చెప్పారు. అయినా సరే, ఇక్కడ కులాన్ని తీసుకురావాలని మీరు అనుకుంటే, రావణుడు ఎవరు? ఒక బ్రాహ్మణుడికి పుట్టినవాడు కాదా? ఆయన స్వయంగా శివుడికి మహాతపస్వి, ప్రతిరోజూ విభూతి పెట్టుకునే వాడు. అయితే, అతను మాత్రం సీతాదేవిని అపహరించలేదా? ఇదే విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. ఒక మనిషి తన స్వభావం, మానసిక స్థితిని బట్టి నేరం చేస్తాడు, తన కులం లేదా మతానికి సంబంధించి కాదు. మనుషుల స్వభావమే అది. యద్భావం తద్భవతి అనే విషయాన్ని ఇలా చెప్పాలనుకున్నాను. మీరు ఏం చూడాలనుకుంటున్నారో అదే కనిపిస్తుంది. కాబట్టి, మీ పర్స్పెక్టివ్ మార్చుకోండి. మేము అనుకోని విషయాలను మాకు ముడిపెట్టొద్దు. అక్కడ యాంకర్ ఆయన్ని పంతులు అని పిలవకుండా ఉండాల్సింది. పెద్దవారు మీరు కరెక్ట్ చేసి వదిలేయాల్సింది. అంతేకానీ, దాన్ని ఇక్కడిదాకా తీసుకువచ్చి ఉండాల్సింది కాదని చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Opinion Polls Survey: బెంగాల్‌పై తాజా సర్వే వచ్చేసింది.. ఈసారి గెలవబోయేది ఎవరంటే..!

  • Tahir Anwar Death: “చచ్చాడా? చంపారా?”.. పాకిస్థాన్‌లో జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అనుమానాస్పద మృతి

  • Raghav Chadha: గ్రాముల్లో ఛార్జీలు వసూలు చేసేవారు.. గంటల ఆలస్యానికి పరిహారం ఇవ్వరా..? విమాన సంస్థల తీరుపై ఫైర్..!

  • RC17 : చరణ్ – సుకుమార్ సినిమా నుండి దేవిశ్రీ అవుట్.. రంగంలోకి ధురంధర్ సెన్సేషన్?

  • Kiara Advani : అమ్మనయ్యాక.. అలా మారక తప్పలేదు..

ట్రెండింగ్‌

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions