కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం “చార్లీ 777”. పరంవా స్టూడియోస్ బ్యానర్ పై జి.ఎస్. గుప్తా, రక్షిత్ శెట్టి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, బాబీ సింహా, డానిష్ సైట్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిరణ్ రాజ్ కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో టైటిల్ రోల్ లో ఓ కుక్క కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమా చార్లీ జర్నీని చూపిస్తున్నారు మేకర్స్. ధర్మ అనే వ్యక్తి లైఫ్ లోకి చార్లీ ఎలా వచ్చాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనేది ప్రధానాంశం. ఈ సినిమా టీజర్ ను లైఫ్ ఆఫ్ చార్లీ పేరుతో నేచురల్ స్టార్ నాని ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ టీజర్ 5 మిలియన్ వ్యూస్ ను దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి.