ఈ సినిమా టైటిల్ “కనబడుటలేదు”… కానీ ట్రెండింగ్ లో మాత్రం బాగా కన్పిస్తోంది. సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో విశేషమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ సాధించిన “కనబడుటలేదు” టీజర్ ఇంకా ట్రెండింగ్ లో ఉండడం విశేషం.
Read Also : బ్యాక్ లెస్ డ్రెస్ లో వేదిక హాట్ ట్రీట్… పిక్స్
నూతన డైరెక్టర్ బలరాజు ఎం దర్శకత్వంలో సుక్రాంత్ వీరెల్లా కథానాయకుడుగా నటిస్తున్నాడు. వైశాలిరాజ్, హిమజ, ఉగ్రన్, ప్రవీణ్, రవివర్మ, కిరీటి దామరాజు, కంచెరపాలెం కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో సునీల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. తల లేని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఆ వ్యక్తి ఎవరు? హత్య చేసింది ఎవరు? అనే విషయాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ టీజర్ చివర్లో ముసుగు ధరించిన ఓ వ్యక్తి కన్పించడం సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఈ థ్రిల్లర్ మూవీ త్వరలో స్పార్క్ OTT లో విడుదల కానుంది.