Mahatma: గాంధీ హత్యోదంత నేపథ్యంలో ‘1948 అఖండ భారత్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికీ తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. దానికి కారణం… దాదాపు ఎనిమిది గంటల పాటు గాడ్సే చెప్పిన మరణ వాగ్మూలం బయటకు రాకపోవడమే. ఈ అంశాలను ప్రామాణికంగా అధ్యయనం చేసి డి. ఈశ్వర్ బాబు తెరకెక్కించిన చిత్రం ‘1948 అఖండ భారత్’. సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం. వై. మహర్షి ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లోనూ, ప్రధానమైన అంతర్జాతీయ భాషల్లోనూ ఈ నెల 12న విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు. దర్శకుడు ఈశ్వర్, ఆర్యవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేశారని, హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్… ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే… ముంబైలో చేయించామని నిర్మాత ఎమ్.వై. మహర్షి పేర్కొన్నారు.
ఈ చిత్ర రచయిత, గాడ్సే పాత్రధారి డాక్టర్ ఆర్యవర్థన్ రాజు మాట్లాడుతూ, “గాడ్సే మరణ వాగ్మూలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో నిషేధించింది. ఆయన్ని ఉరి తీసిన మూడు దశాబ్దాల తర్వాత అది బయటకు వచ్చినా ప్రచురితం కాకుండా అడ్డుకుంది. అలా 70 సంవత్సరాలు దాచి పెట్టిన నిజాలను పరిశోధన చేసి ఈ స్క్రిప్ట్ ను తయారుచేశాం. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి. హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీశాం” అని అన్నారు. చిత్ర దర్శకుడు ఈశ్వర్ డి. బాబు మాట్లాడుతూ, ”11, 372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 700కి పైగా ప్రొపర్టీస్, 500కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో, 9షెడ్యూల్స్ లో… ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం” అని చెప్పారు.
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
విడుదల తేదీని తెలియచేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ‘బాలకృష్ణ నటించగా అద్భుత విజయం సాధించిన ‘అఖండ’ తరహాలో ‘1948 – అఖండ భారత్’ చిత్రం విజయం సాధించాల’ని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే… తలకిందులుగా తపస్సు చేసినా… ఈ చిత్రం సెన్సార్ అయ్యేది కాదని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో సంగీత దర్శకుడు ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ రాజు జాదవ్, నటుడు సుహాస్ కూడా పాల్గొన్నారు. ‘1948 అఖండ భారత్’ చిత్రంలో గాంధీగా రఘునందన్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?