`ఛత్రపతి` రీమేక్ విషయంలో కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాల్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఎస్.ఎస్. రాజమౌళి ఛత్రపతి చిత్రం హిందీ రీమేక్ ఒకటి కాగా, ధనుష్ నటించిన తమిళ చిత్రం కర్ణన్ తెలుగు రీమేక్ మరొకటి. తనను తెలుగులో హీరోగా పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ను ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి తీసుకెళ్ళాలని సాయి శ్రీనివాస్ అనుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను భారీ స్థాయిలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై డా. జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ కు ఊహించని అవరోధాలు ఎదురయ్యాయి. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్‌ను ఏప్రిల్ 22న మొదలు పెట్టాలనుకున్నారు. ఇందుకోసం 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఏకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ సునీల్‌బాబు ఓ విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు. ‘రంగస్థలం’ విలేజ్ సెట్‌ను కూడా అప్పట్లో ఇదే లొకేషన్లో క్రియేట్ చేశారు. దురదృష్టవశాత్తు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు, లాక్డౌన్ వంటి కారణాలతో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్‌ను అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయారు. ఈ లోపు 3 కోట్ల రూపాయలతో వేసిన సెట్ ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల తాకిడికి తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్దరించే పనిలో పడ్డారు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు అండ్ కో. ఈ సెట్ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు మేకర్స్.
మరో వైపు తమిళ కర్ణన్ తెలుగు రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇక్కడ జోర్దార్ గా సాగుతోంది. సో… ముందుగా సింగిల్ షెడ్యూల్ లో కర్ణన్ చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనకు సాయి శ్రీనివాస్ వచ్చాడట. పరిస్థితులు కాస్తంత చక్కబడగానే కర్ణన్‌ను పూర్తి చేసి, ఆ పైనే హిందీ ఛత్రపతిని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ఈ యేడాది సంక్రాంతికి అల్లుడు అదుర్స్‌తో జనం ముందుకు వచ్చిన సాయి శ్రీనివాస్ ఇదే యేడాది అందుకు పూర్తి భిన్నమైన కథాంశంతో, కర్ణన్ లాంటి అర్థవంతమైన సినిమాతో మరోమారు ప్రేక్షకులను పలకరించడం అనేది విశేషమే!
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..