అవెంజర్స్ సినిమాలో సూపర్ హీరో ‘థార్’ పాత్రలో కనిపించి వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు క్రిస్ హేమ్స్ వర్త్. ఉరుముల దొరగా ఇండియాలో ఫేమస్ అయిన క్రిస్, 2020లో ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బ్లాక్ ఒప్స్ స్పెషల్ కమాండో ‘టైలర్ రేక్’ పాత్రలో క్రిస్ హేమ్స్ వర్త్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించిన మెప్పించిన క్రిస్ హేమ్స్ వర్త్ ప్లే చేసిన క్యారెక్టర్ ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమా ఎండ్ లో చనిపోయినట్లు చూపిస్తారు. ఈ మూవీ ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ చేస్తూ రుస్సో బ్రదర్స్ ‘ఎక్స్ట్రాక్షన్ 2’ని అనౌన్స్ చేశారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ గా జూన్ 16న టెలికాస్ట్ కానున్న ‘ఎక్స్ట్రాక్షన్ 2’ సినిమాని ‘సామ్ హర్గ్రేవ్’ డైరెక్ట్ చేశాడు.
రుస్సో బ్రదర్స్ రైటింగ్ కి మాత్రమే పరిమితం అవ్వడంతో ‘సామ్ హర్గ్రేవ్’కే ఎక్స్ట్రాక్షన్ రెండు భాగాలని తెరకెక్కించే అవకాశం దక్కింది. టెలికాస్ట్ టైం దగ్గర పడడంతో మేకర్స్ ‘ఎక్స్ట్రాక్షన్ 2’ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివితో కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేసిన ట్రైలర్, యాక్షన్ మూవీ లవర్స్ కి ఇంప్రెస్ చేసేలా ఉంది. మరోసారి మెర్సినరీ టైలర్ రేక్ పాత్రలో క్రిస్ హేమ్స్ వర్త్ ఫిట్ అండ్ రాక్ సాలిడ్ గా కనిపించాడు. ఎప్పటిలానే రుస్సో బ్రదర్ గ్రాండ్, నెవర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేశారనే విషయం ట్రైలర్ తోనే అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఒక 21 నిమిషాల పాటు ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అయ్యేలా ఉంటుందట. సింగల్ టేక్ లో, ఎలాంటి కట్స్ లేకుండా తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిసోడ్ మూవీ లవర్స్ ని ఫిదా చెయ్యడం గ్యారెంటీ అనే చెప్పాలి. మరి మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ‘ఎక్స్ట్రాక్షన్’ సీక్వెల్ మూవీ లవర్స్ ని ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.
Here we go! #Extraction2 trailer smacking you right between the eyes. Enjoy this 2 mins of madness before Extraction 2 drops June 16th, only on @netflix. pic.twitter.com/orIhX2ifDD
— Chris Hemsworth (@chrishemsworth) May 16, 2023