Sandeep: నేడు ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ గా నటించిన ‘మన వరశంకర ప్రసాద్ గారు’ సినిమా రిలీజ్ అయింది. ఆదివారం నాడే ప్రీమియర్ షోలతో విడుదలైన సినిమా అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ చూసామంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక సినిమాలో ఆయన చేసిన నటన, డాన్స్, కామెడీ, ఇలా అన్ని విభాగాలలో ఇరగదీసాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తున్నారు. ఇక సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ నటన, వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా అద్భుతం అంటూ చిరంజీవి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సినిమాలోని హుక్ స్టెప్ పాటకు కొరియోగ్రాఫీ చేసిన సందీప్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాదులో ప్రముఖ థియేటర్ లో సినిమా చూసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగా.. ఓ రిపోర్టర్ ఫ్యూచర్ లో మీరు రామ్ చరణ్ కు కొరియోగ్రఫీ చేస్తారా అని అడిగారు. సందీప్ అందుకు సమాధానంగా చరణ్ తో కొరియోగ్రఫీ చేస్తే ఇంకా 100% బెటర్ కొరియోగ్రఫీతో ర్యాంప్ ఆడిస్తా అంటూ మాట్లాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి క్రేజ్.. ఆయన తర్వాత రామ్ చరణ్ లోనే అంటూ మాట్లాడారు. ఇంకా రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఒక గొప్ప డాన్సర్ అంటూనే.. ఎంత కష్టమైనా స్టెప్ అయినా సరే ఎదుటివారికి తెలియకుండా చాలా సులువుగా చేయడం అతడి స్పెషాలిటీ అంటూ మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Stock Market: ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. లాభాల్లో సూచీలు
ChiranJeevi kastha CHARANJEEVI ayyadu @AlwaysRamCharan 🦁🔥pic.twitter.com/hA6LFV33nZ
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) January 12, 2026