Megastar Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. మెగాస్టార్ అంటే తెలియని వారే ఉండరు. దాదాపు మూడు తరాలను ఆయన అలరిస్తూనే ఉన్నారు. ఒక్కడిగా వచ్చి మెగా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. శిఖరాలను అధిరోహించాడు. దేశ సరిహద్దులు దాటి ఖ్యాతి సంపాదించాడు. తక్కువ టైమ్ లోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎదిగాడు చిరంజీవి. అలాంటి చిరంజీవి ముందు మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ లో అప్పటి నిర్మాత కేఎస్ రామారావు చిరంజీవి కలయికలో ఎక్కువగా సినిమాలు వచ్చేవి. వీరిద్దరి సినిమాలకు కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా ఉండేవాడు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వరుసగా అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు కూడా యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా వచ్చాయి.
Read Also : Arya Marriage : 12 ఏళ్ల కూతురు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న యాంకర్
ఈ మూడు సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల్లో చిరుకు మాస్ ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. వీరి కాంబోలోనే నాలుగో సినిమాగా మరణ మృదంగం వచ్చింది. 1988 ఆగస్టు 4న ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాలోనే చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదు కనిపించింది. నిర్మాత కేఎస్ రామారావు ఈ బిరుదును వేయించారు. చిరుకు అరుదైన బహుమతిగా దీన్ని వేయించారు. అప్పటి వరకు సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవి మెగాస్టార్ గా అవతరించారు. ఆ బిరుదుకు తగ్గట్టే తర్వాత కాలంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ టాలీవుడ్ సింహాసనంపై కూర్చున్నారు. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. నిజంగా మెగాస్టార్ అనే బిరుదు ఆయన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఆయన క్రేజ్ ఆ స్థాయిలో పెరిగింది. మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి.. ఆ తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో వరుసగా నటిస్తూ 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు తీస్తున్నారు.
Read Also : Venky Comedian Ramachandra : మంచాన పడ్డ ‘వెంకీ’ సినిమా కమెడియన్ రామచంద్ర