మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఎక్కువ అంచనాలు నెలకొల్పిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా వచ్చే 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే, ఈ సినిమా పై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ తర్వాత రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగానూ రికార్డు స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌ను ఫైనల్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Ram Pothineni : ఆంధ్రా కింగ్ కోసం రామ్ కొత్త ప్రయోగం.. ఇది కూడా భాగ్యశ్రీ కోసమేనా?
కాగా తాజా సమాచారం ప్రకారం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్. అలాగే ఆడియో, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్‌పైనా మంచి ఆఫర్లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుండటం మరో ప్రత్యేకత. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. రాబోయే నెలల్లో మ్యూజిక్, ట్రైలర్ రిలీజ్‌లతో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశముంది. మెగాస్టార్ చిరంజీవి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ముందుగా విడుదల కానుంది. మరి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.