Site icon NTV Telugu

Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి మూవీ నుంచి కీలక అప్డేట్

Meesala Pilla Chiranjeevi

Meesala Pilla Chiranjeevi

Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా చాలా స్పీడ్ గా మూవీ షూటింగ్ ను జరుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మూవీ దాదాపు ఎండింగ్ స్టేజ్ కు వచ్చేసింది. ఈ సినిమా ఆదివారం నుంచి హైదరాబాద్‌లో క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్రారంభించుకుంది.

Read Also : Nagavamsi : వార్-2 దెబ్బకు షాకింగ్ నిర్ణయం తీసుకున్న నాగవంశీ

చిరుతో పాటు ఫైటర్స్‌ టీమ్ ఈ షూట్ లో చాలా కష్టపడుతున్నారు. కొరియోగ్రాఫర్‌ వెంకట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. మూవీ మొత్తం కామెడీ టచ్ ఉంటే.. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకు హైప్ తీసుకువస్తాయంటున్నారు. చిరు యాక్షన్ సీన్లు చూస్తే గూస్ బంప్స్ పక్కా అంటున్నారు. మూవీని డిసెంబర్ వరకు లోపే కంప్లీట్ చేసేసి పూర్తి ప్రమోషన్లకు టైమ్ కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారంట. అనిల్ సినిమాలకు కామన్ గానే ప్రమోషన్లు ఎక్కువగా చేస్తుంటారు.

Read Also : Bigg Boss 9 : నువ్వు వెళ్లిపో.. తనూజపై భరణి ఫైర్.. తండ్రి, కూతుర్ల ఫైట్

Exit mobile version