పూజా కార్యక్రమాలతో లాంఛనంగా “భోళా శంకర్” ప్రారంభోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిరు అయ్యప్ప మాలలో ప్రత్యేక పూజలు చేశారు. మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ, దర్శకులు వివి వినాయక్, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ తదితరులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తొలి క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. వివి వినాయక్ కెమెరా స్విచాన్ చేశారు. అంతకు ముందు ఈ కార్యక్రమానికి హాజరైన కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, మలినేని గోపీచంద్, ఎన్ శంకర్, రచయిత సత్యానంద్‌లు చిత్ర స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. ‘భోళా శంకర్’ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుండి ప్రారంభమవుతుంది. “భోళా శంకర్”లో చిరు కథానాయికగా తమన్నా నటిస్తుండగా, మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదాళం’ మాదిరిగానే భోళా శంకర్” కథ కూడా కోల్‌కతానేపథ్యంలో సాగుతుంది. సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం ఈ ఐకానిక్ సిటీలో జరుగుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించగా, డడ్లీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!