Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత లండన్ బ్రిడ్జ్ ఇండియా సంస్థ మెగాస్టార్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. అంతే కాకుండా యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అక్కడి ఎంపీలు మినిస్టర్లు, ఇతర ఎన్నారైలు చిరంజీవిని సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి లండన్ లో ఉన్న తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘మీతో మాట్లాడుతుంటే నా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టే ఉంది. మీరంతా ఎప్పుడో ఒక టైమ్ లో నా సినిమాలను లేదా పాటలను విని స్పందించే ఉంటారు. మీ మాటలు నా దాకా చేరుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లతో కలవాలని ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను’ అన్నారు.
Read Also : Parigi : హైడ్రా రాకున్నా రెవెన్యూ అధికారుల దూకుడు..
‘మీరందరూ నా అన్నదమ్ములు, అక్కా తమ్ముళ్ల లాంటి వారు. మీ అందరి ఇంటికి వచ్చి నా చెల్లెమ్మల చేతి వంటలు తినాలని ఉంది. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. కచ్చితంగా ఆ అవకాశం త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు భేషజాలాలు లేవు. నేను సినిమాల్లో అనుకున్న స్థాయికి వచ్చాను. నా తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో నా ఆశలను కొనసాగిస్తున్నాడు. అతనికి మనందరి ప్రేమ అవసరం ఉంది. మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.