Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే

Korean

Korean

ఒక సినిమా విజయం సాధిస్తే అది కేవలం కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, ఆ చిత్రంతో ముడిపడి ఉన్న వందలాది కుటుంబాలలో ఎనలేని ఆనందాన్ని నింపుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ “సినిమా హిట్ అయిన వెంటనే దీని విజయాన్ని పదిమందితో పంచుకోవాలని, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపాలని వరుణ్ నన్ను ఆహ్వానించాడు. ఒక సినిమా విజయం సాధిస్తే బయ్యర్లు, ఎగ్జిబిటర్ల బ్యాంక్ అకౌంట్లు నిండటమే కాకుండా, రోజువారీ పనిచేసే సినిమా కార్మికుల కుటుంబాలకు కడుపు నిండుతుంది. నిర్మాతలు, నటీనటులు ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకదేవుళ్లకు తలవంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను.” అన్నారం

నటుడిగా వరుణ్ ప్రయత్నం అభినందనీయం

తన కుమారుడు వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ, “నేను ఇక్కడ ఒక తండ్రిగా మాట్లాడటం లేదు. వరుణ్ ఎప్పుడూ సేఫ్ జోన్‌లో ఉండటానికి ఇష్టపడడు. కేవలం కమర్షియల్ సినిమాలు చేసేసి స్టార్‌డమ్ తెచ్చుకోవాలనే తాపత్రయం అతనిలో లేదు. వైవిధ్యమైన కథలను, కొత్త తరహా జోనర్లను ఎంచుకుంటూ ఒక మంచి నటుడిగా నిలదొక్కుకోవాలనేదే తన ఆరాటం. కొన్నిసార్లు ఫలితాలు అటుఇటు కావచ్చు, కానీ ఒక నటుడిగా వరుణ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అదే ధైర్యంతో, కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళు.. నువ్వు తప్పకుండా వెర్సటైల్ యాక్టర్‌గా స్థిరపడతావు” అని వరుణ్ తేజ్‌కు దిశా నిర్దేశం చేశారు. అలాగే సరదాగా స్పందిస్తూ, “ఈ విజయాన్ని వరుణ్ తన ఖాతాలో వేసుకోవద్దు, ఇది మన బుడ్డోడు ‘వాయు తేజ్’ తెచ్చిన అదృష్టం, వాడే మన లక్కీ చార్మ్” అని నవ్వేశారు.