మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. కుర్ర హీరోలకంటే ఎక్కువగా చిరు సినిమాలను లైన్లో పెట్టడం.. షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ కి రెడీ చేయడం కూడా జరిగిపోతున్నాయి. ఇక ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లో చిరు వాణిజ్య ప్రకటనలకు కూడా సై అంటున్నాడు. ఇటీవలే చిరు శుభగృహ రియల్ ఎస్టేట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక దీనికోసం చాలా రోజుల తరువాత చిరు కమర్షియల్ యాడ్ లో నటించాడు. గతంలో థమ్స్ అప్ యాడ్ లో నటించి రికార్డు సృష్టించిన మెగాస్టార్ ఆ తరువాత మరో యాడ్ లో నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ రియల్ ఎస్టేట్ కమర్షియల్ యాడ్ లో నటించారు. ఇక ఈ యాడ్ కి దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో చిరుతో పాటు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ, హాట్ యాంకర్ అనసూయ కనిపించారు.
ఇక దీనికోసం చిరు కూడా భారీగానే అందుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో కూడా కుర్ర స్టార్లకు ఏమాత్రం తీసిపోలేదట చిరు. వాణిజ్య ప్రకటనలు అంటే మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంత లాంటివారు టక్కున గుర్తొస్తారు.. వీరు ప్రస్తుతం ఒక్కో యాడ్ కి కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక చోరు కూడా ఈ యాడ్ కి అక్షరాలా రూ. ఏడు కోట్లు డిమాండ్ చేసినట్లు వినికిడి. ఇప్పటి వరకు తెలుగులో యాడ్ ఫిల్మ్స్ లో నటించిన ఏ హీరో కూడా ఈ స్థాయిలో పారితోషికం తీసుకోలేదని, ఈ స్థాయిలో ఓ రియల్ ఎస్టేట్ యాడ్ కు రెమ్యునపరేషన్ అందుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మరి ఎక్కడైనా మెగాస్టార్ రేంజ్ మెగాస్టార్ కే ఉంటుందిగా.. ఏదేమైనా చిరు రేంజ్ వేరే అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుండగా.. మరికొంతమంది నెటిజన్స్ మాత్రం ఇంత చిన్న యాడ్ కి అన్ని కోట్లా..? అని నోళ్లు వెళ్లబెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
