Chiranjeevi: చిన్న యాడ్ కే చిరు అంత తీసుకున్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. కుర్ర హీరోలకంటే ఎక్కువగా చిరు సినిమాలను లైన్లో పెట్టడం.. షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ కి రెడీ చేయడం కూడా జరిగిపోతున్నాయి. ఇక ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లో చిరు వాణిజ్య ప్రకటనలకు కూడా సై అంటున్నాడు. ఇటీవలే చిరు శుభగృహ రియల్ ఎస్టేట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక దీనికోసం చాలా రోజుల తరువాత చిరు కమర్షియల్ యాడ్ లో నటించాడు. గతంలో థమ్స్ అప్ యాడ్ లో నటించి రికార్డు సృష్టించిన మెగాస్టార్ ఆ తరువాత మరో యాడ్ లో నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ రియల్ ఎస్టేట్ కమర్షియల్ యాడ్ లో నటించారు. ఇక ఈ యాడ్ కి దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో చిరుతో పాటు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ, హాట్ యాంకర్ అనసూయ కనిపించారు.
ఇక దీనికోసం చిరు కూడా భారీగానే అందుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో కూడా కుర్ర స్టార్లకు ఏమాత్రం తీసిపోలేదట చిరు. వాణిజ్య ప్రకటనలు అంటే మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంత లాంటివారు టక్కున గుర్తొస్తారు.. వీరు ప్రస్తుతం ఒక్కో యాడ్ కి కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక చోరు కూడా ఈ యాడ్ కి అక్షరాలా రూ. ఏడు కోట్లు డిమాండ్ చేసినట్లు వినికిడి. ఇప్పటి వరకు తెలుగులో యాడ్ ఫిల్మ్స్ లో నటించిన ఏ హీరో కూడా ఈ స్థాయిలో పారితోషికం తీసుకోలేదని, ఈ స్థాయిలో ఓ రియల్ ఎస్టేట్ యాడ్ కు రెమ్యునపరేషన్ అందుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మరి ఎక్కడైనా మెగాస్టార్ రేంజ్ మెగాస్టార్ కే ఉంటుందిగా.. ఏదేమైనా చిరు రేంజ్ వేరే అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుండగా.. మరికొంతమంది నెటిజన్స్ మాత్రం ఇంత చిన్న యాడ్ కి అన్ని కోట్లా..? అని నోళ్లు వెళ్లబెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
- KING : షారూఖ్ ఖాన్ కింగ్‌ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
- SPIRIT : ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? 'స్పిరిట్'పై మాకు నమ్మకం లేదు?
- Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
తాజావార్తలు
-
Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
-
Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
-
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
-
KING : షారూఖ్ ఖాన్ కింగ్‌ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!