మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో సాగిపోతున్న ఈ సినిమా, కలెక్షన్ల వర్షం సైతం కురిపిస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ సినిమాకి ఫ్యామిలీస్ అన్నీ కదిలి వస్తున్నాయి.
ఇక సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూని ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
Also Read: Kotha Malupu: సింగర్ సునీత కొడుకు రెండో సినిమా వచ్చేస్తోంది!
ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో చెబుతూ, తనకు ఒకరు ఈ విషయం షేర్ చేశారని అన్నారు. గత మూడు నెలలుగా విడాకులు తీసుకుందామని సిద్ధమవుతున్న ఒక జంట, ఈ సినిమా చూసిన తర్వాత కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఈ సినిమాలో ఏదైతే పాయింట్ డిస్కస్ చేశామో, అది కరెక్ట్‌గా ప్రేక్షకులకు రీచ్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం కచ్చితంగా ఉండకూడదని, ఉంటే ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో సినిమాలో చూపించామని అన్నారు. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
