The Family Man : ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి అని తెలుసా..?

  • సినిమాగా తీద్దామని ప్లాన్
  • వర్కౌట్ కాక వెబ్ సిరీస్
  • చిరంజీవి వద్దనడానికి రీజన్ అదే
Chiranjeevi

Chiranjeevi

The Family Man : ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ విడుదలైనరోజు నుంచి ఏజెంట్ శ్రీకాంత్ తివారీ రూపం అంటే మనోజ్ బాజ్‌పాయియే గుర్తొస్తాడు. ఆయన నటన, స్క్రీన్‌ ప్రెజెన్స్ ఆ పాత్రను అంతగా ప్రేక్షకుల మనసుల్లో నాటేసింది. అయితే ఈ పాత్రకు మొదటి ఛాయిస్ మెగాస్టార్ చిరంజీవి అని చాలా మందికి తెలియదు. డైరెక్టర్ జంట రాజ్–డీకే ఈ కథను మొదట ఒక ఫుల్‌లెంగ్త్ సినిమా స్క్రిప్ట్‌గా రాసారట. ఆ కథను అశ్వనీదత్‌కు చెప్పగా ఆయనకు బాగా నచ్చింది. వెంటనే చిరంజీవిని కలిసి కథను వినిపించాడు.

Read Also : Mouni Roy : డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

×
×
Ad

చిరంజీవికీ కథ బాగానే నచ్చినా.. ‘ఖైదీ నెం.150’ హిట్ కావడంతో ఇద్దరు పిల్లల తండ్రిగా నటించడం వద్దనుకున్నారు. రాజ్–డీకే అవసరమైతే పిల్లల పాత్రలను కథ నుంచి పూర్తిగా తీసేసి మూవీ చేద్దామని చెప్పినా ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ తర్వాత వారు ఈ కథను వెబ్‌ ఫార్మాట్‌కు మార్చి మనోజ్ బాజ్‌పాయిని ఎంపిక చేశారు. ఈ వెబ్ సిరీస్ లో ముందు మనోజ్ నటించడానికి ఇష్టపడలేదు. కానీ కథ లోతు అర్థం చేసుకుని చేశాక.. ఆయనకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు వచ్చాయి.

Read Also : Ravi Babu : ఆ పోస్టర్ చూసి నన్ను తిట్టారు.. రవిబాబు కామెంట్స్