Site icon NTV Telugu

Chiranjeevi : నా కోడలిని చూస్తే గర్వంగా ఉంది.. చిరు ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు ఇచ్చింది. స్పోర్ట్స్ హబ్ వైస్ చైర్మన్ గా ఉపాసనను నియమించారు సీఎం రేవంత్. దీంతో ఉపాసనకు చాలా మంది విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా కోడలు ఉపాసన ఇప్పుడు స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు గర్వకారణమే కాదు.. ఎంతో ఆనందం కూడా. ఉపాసనకు నీకున్న కమిట్ మెంట్, పాషన్ తో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తావని ఆశిస్తున్నాను. స్పోర్ట్స్ లో మన స్థాయిని మరింత పెంచాలి అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన థాంక్స్ చెప్పారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సంజీవ్ గొయెంకాను స్పోర్ట్స్ హబ్ చైర్మన్ గా నియమించారు.

Read Also : WAR 2: ఎన్టీఆర్-హృతిక్ మధ్య ట్వీట్ వార్.. ఎందుకంటే..?

దీంతో ఉపాసన పేరు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. సంజీవ్ గొయెంకాతో పనిచేసేందుకు వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎన్నో విషయాలను చెబుతుంటారు. డైట్, హెల్త్, ఫిట్ నెస్ గురించి అవగాహన కల్పిస్తూ ఉంటుంది. అదే ఆమెకు ఈ అవకాశం వచ్చేలా చేసిందని అంటున్నారు ఆమె ఫాలోవర్స్. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన నిన్న కలవగా.. నేడు ఉపాసనకు కీలక బాధ్యతలు రావడం విశేషం.

Read Also : Sonusood : ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలిసిన సోనూసూద్

Exit mobile version