Chiranjeevi: LK అద్వానీకి భారతరత్న.. రాజకీయ నాయకుల గౌరవాన్ని పెంచారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానికి(96) అందజేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మోదీ చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఎల్‌కే అద్వానికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పద్మ విభూషణ్ చిరంజీవి.. ఎల్‌కే అద్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ” ‘భారతరత్న’ నిస్సందేహంగా శ్రీ ఎల్‌కే అద్వానీ జీకి ఎంతో అర్హమైన గౌరవం. మన దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. స్వాతంత్ర్యానికి పూర్వం.. అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనది. అద్వానీ జీ వంటి దిగ్గజాలు రాజకీయాలు, రాజకీయ నాయకుల స్థాయిని, గౌరవాన్ని పెంచారు.. హృదయపూర్వక అభినందనలు ఎల్‌కే అద్వాని జీ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఎల్‌కే అద్వాని గురించి చెప్పాలంటే ఆయన పూర్తిపేరు లాల్ కృష్ణ అద్వానీ.1970 నుంచి 2019 మధ్య ఎల్‌కే అద్వానీ.. పార్లమెంటు ఉభయసభల్లో సభ్యుడిగా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టి యావత్ దేశాన్ని ఏకం చేసిన వ్యక్తిగా ఎల్‌కే అద్వానీ చరిత్రలో నిలిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయినప్పటికీ అద్వానీ విశేష ప్రజాదరణను పొందారు. కచ్చితంగా ఆయన అత్యన్నుత పురస్కారంకు అర్హుడే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
‘Bharat Ratna’ is undoubtedly a greatly deserving honour to Shri LK Advani ji. He is one of the most distinguished statesmen our country has ever seen. His contribution to nation building since Pre Independence era and over several decades is invaluable. Stalwarts such as Advani…
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2024
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!