Chiranjeevi Confirmed Waltair Veerayya Title For Mega154: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ యాక్షన్ మూవీ టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అనేది ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే ఆ విషయాన్ని చిత్ర బృందం ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మాస్ మహరాజా రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. దర్శకుడు బాబీ కథను రాసుకున్న ఈ సినిమాకు కోన వెంకట్, చక్రవర్తి స్క్రీన్ ప్లే సమకూర్చారు. హరి మోహనకృష్ణ, వినీత్ పొట్లూరి రచనా సహకారం అందిస్తున్నారు. ఇందులో వింటేజ్ చిరంజీవిని బాబీ తెర మీద ప్రెజెంట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
అంతేకాదు… ఉత్తరాంధ్ర యాసతో పవర్ ఫుల్ డైలాగ్స్ తో చిరంజీవి ఆకట్టుకుంటాడని అంటున్నారు. గురువారం తనను కలిసి మీడియా ప్రతినిధులతో చిరంజీవి ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ టైటిలే పెడుతున్నట్టు చెప్పారు. అంతేకాదు… ఆ టైటిల్ పెట్టడం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన కథ ఉందని, దాన్ని సమయం వచ్చినప్పుడు చెబుతానని చిరంజీవి అన్నారు. మరో విశేషం ఏమంటే… ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ ను అధికారికంగా ప్రకటించడంతో పాటు దీపావళి కానుకగా మూవీ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి జి. కె. మోహన్ సహ నిర్మాత కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.