Chinmayi: పవన్ కళ్యాణ్’ను కూడా వదలని చిన్మయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికైన తమిళ లిరిసిస్ట్ వైరముత్తుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ (X) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ అభినందనల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను వివాదానికి దారితీసింది. వైరముత్తుపై గతంలో వచ్చిన ‘మీటూ’ ఆరోపణలను ప్రస్తావిస్తూ గాయని చిన్మయి శ్రీపాద పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైరముత్తును ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై చిన్మయి స్పందిస్తూ.. “గౌరవపూర్వకంగానే చెబుతున్నాను, వైరముత్తు అసలు నైజం పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండదు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకోవడం సరికాదు. ఈ విషయాన్ని పవన్ గారి కార్యాలయ సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్లాలి. కేవలం సినిమాల్లో పాటలు రాసే వ్యక్తిని రాజకీయ నాయకులు ఎందుకు ఇలా ఆకాశానికెత్తుతున్నారో అర్థం కావడం లేదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వైరముత్తుకు శుభాకాంక్షలు తెలపగా, చిన్మయి “అయ్యో.. మీకు ఇంకా అర్థం కావడం లేదా?” అని రిప్లై ఇచ్చారు. దీనిపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను “గౌరవంతో” సంబోధించిన చిన్మయి, రజనీకాంత్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అధికారంలో ఉన్న వారిని చూసి చిన్మయి భయపడుతున్నారా? అని కొందరు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చిన్మయి స్పందిస్తూ.. “నేను వైరముత్తు గురించి ఏళ్ల తరబడి పోరాడుతున్నాను. నాకు సినీ పరిశ్రమలో అన్యాయం జరిగినప్పుడు మీరంతా మౌనంగానే ఉన్నారు కదా? మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారికి మద్దతు ఇచ్చేవారిని ఎప్పటికీ నమ్మకూడదు” అని క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ వివాదంలోకి ప్రవేశించారు. “పవన్ కళ్యాణ్ గారు అందరినీ గౌరవించే వ్యక్తి. మా దైవం లాంటి వ్యక్తి గురించి తెలియకుండా మాట్లాడకండి” అని ఒక అభిమాని కామెంట్ చేయగా, “మీరు నన్ను గౌరవించడం ముఖ్యం కాదు. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలి” అని చిన్మయి బదులిచ్చారు. మరోవైపు, వివాదాలతో సంబంధం లేకుండా వైరముత్తు తనకు శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్, కమల్ హాసన్ మరియు పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పురస్కారాన్ని తనకు ఇష్టమైన వారికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి సమాధిని సందర్శించి నివాళులర్పించిన ఆయన, “నువ్వు లేని లోటు కనిపిస్తోంది, కన్నీళ్లతో ఈ పువ్వును సమర్పిస్తున్నాను” అంటూ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!