Site icon NTV Telugu

ఆకట్టుకుంటున్న “మహా సముద్రం” మెలోడీ సాంగ్

Cheppake Cheppake Lyrical from Maha Samudram

“మహా సముద్రం” నుండి వచ్చిన మొదటి పాట “హే రంభ”కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా “మహా సముద్రం” నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెప్పకే చెప్పకే” అంటూ మంచి మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్ వింటుంటే అదితి రావు హైదరి పాత్ర శర్వానంద్‌ పాత్రను పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు అర్థమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీలో బీచ్‌ సైడ్‌లో చిత్రీకరించిన విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

Read also : ‘తడమ్’ హిందీ రీమేక్ లో మృణాల్ ఠాకూర్‌!

ప్రసాద్ సాహిత్యం అద్భుతం. దీప్తి పార్థసారధి తన మనోహరమైన గాత్రంతో మరో ప్రపంచానికి తీసుకెళుతుంది. ఈ సాంగ్ మేకింగ్ వీడియో ఇంటరెస్టింగ్ గా ఉంది. అయితే ఈ మేకింగ్ వీడియో మధ్యలో శర్వానంద్ ఇంటికి అను ఇమ్మాన్యుయేల్ రావడం ఆసక్తికరంగా మారింది. దీంతో టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఇంటెన్స్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడింది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Exit mobile version