‘తడమ్’ హిందీ రీమేక్ లో మృణాల్ ఠాకూర్‌!

అరుణ్‌ విజయ్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘తడమ్’ 2019లో విడుదలైంది. అరుణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఈ యేడాది తెలుగులో ‘రెడ్’ పేరుతో రీమేక్ చేశారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో చక్కని విజయాన్ని అందుకున్న ఈ మూవీని టీ సీరిస్ సంస్థ హిందీలో రీమేక్ చేయబోతోంది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీతో వర్థన్ కేత్కర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ యేడాది అక్టోబర్ మాసంలో ఢిల్లీలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఇందులో నాయికగా మృణాల్ ఠాగూర్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మృణాల్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

Read Also : ఫామ్ లోకి వస్తున్న దివ్య శ్రీపాద!

విశేషం ఏమంటే… మృణాల్ ఠాగూర్ కు దక్షిణాదితో అనుబంధం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఇటీవల వచ్చిన ‘తూఫాన్’లో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాగూర్, హిందీలో రీమేక్ అవుతున్న ‘జెర్సీ’లోనూ హీరోయిన్ గా నటించింది. మరో విశేషం ఏమంటే… ఈ అందాల చిన్నది తెలుగు స్ట్రయింట్ మూవీలోనూ నటిస్తోంది. స్వప్న సినిమాస్ బ్యానర్ లో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘లెఫ్టినెంట్ రామ్’లో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రను మృణాల్ ఠాకూర్ పోషిస్తోంది. మొత్తం మీద సౌతిండియన్ మూవీస్ లోనూ, వాటి హిందీ రీమేక్స్ లోనూ బాగానే చోటు దక్కించుకుంటోంది మృణాల్ ఠాకూర్.

Related Articles

Latest Articles

-Advertisement-