దళితులను తమిళ ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని నటి, బిగ్బాస్ బ్యూటీ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. కాగా, ఆమె హాజరు కాకపోయేసరికి అరెస్ట్ అవుతుందంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. నన్ను అరెస్ట్ చేయడం మీ కల..…
తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్‌ను చెన్నై పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి షెడ్యూల్ కులాలకు చెందిన దర్శకులు, నటులను గెంటేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ దర్శకుడు తన అనుమతి లేకుండా తన ఫోటోను సినిమా ఫస్ట్ లుక్ కోసం ఉపయోగించాడని ఆరోపిస్తూ షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా అవమానకరమైన పదాలను ఉపయోగించింది. ‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి…