Chandramukhi 2 OTT streaming date: రాఘవ లారెన్స్ -కంగనా రనౌత్ ప్రధాన నటించిన చంద్రముఖి 2 ఇటీవల విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచి కొంత మేర కలెక్షన్లు కూడా సాధించింది. ఈ సినిమా “ది వ్యాక్సిన్ వార్” “ఫుక్రే 3″తో పాటు విడుదలైంది. హర్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ చంద్రముఖి 2 సినిమా దాని ప్రీక్వెల్ సాధించిన చంద్రముఖి విజయ స్థాయికి కూడా చేరుకోలేకపోయింది. పి. వాసు దర్శకత్వం వహించిన “చంద్రముఖి 2” రజనీకాంత్ – జ్యోతిక నటించిన 2005 బ్లాక్‌బస్టర్ “చంద్రముఖి”కి సీక్వెల్. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రన్ తర్వాత, ఈ సినిమా ఇప్పుడు OTT విడుదలకు సిద్ధం అయింది. ఇక ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. అంతేకాక ఈ సినిమా అక్టోబర్ 26న అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
Leo: లియో ఫ్లాష్ బ్యాక్ అంతా అబద్దమా?.. ఇదేం ట్విస్ట్ లోకేశా?
ఈ సినిమాలో కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రను పోషిస్తుండగా, రాఘవ లారెన్స్ పాండియన్ మరియు వెట్టయన్‌గా ద్వంద్వ పాత్రలను పోషించారు. ఈ సినిమాలో లక్ష్మీ మీనన్, రాధిక శరత్‌కుమార్, మహిమా నంబియార్, సృష్టి డాంగే, రావు రమేష్, సుభిక్షా కృష్ణన్‌లతో సహా ప్రతిభావంతులైన ఎంతోమంది నటీనటులు భాగమయ్యారు. ఇది పాన్-ఇండియా ప్రాజెక్ట్ కాగా సినిమా తమిళ, హిందీ, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదలైంది. ఎవరూ నివాసం ఉందని వేట్టైయన్ ప్యాలెస్‌ని కలిగి ఉన్న వ్యక్తి, దానిని సంపన్న కుటుంబానికి అద్దెకు ఇవ్వడంతో కథ మొదలవుతుంది. ఆ కుటుంబం తన కులదేవత గుడికి వెళ్లి పూజ జరిపేందుకు పూనుకుంటారు. అయితే అదే తెలియకుండా చంద్రముఖిని నిద్ర లేపుతుంది.