Chandramukhi 2: చంద్రముఖి ఆగమనానికి రంగం సిద్ధం.. 24న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
Chandramukhi 2 Getting ready for a grand Release: కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలా మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుండగా తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా రిలీజైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లిందనే చెప్పాలి. 17 సంవత్సరాల క్రితం చంద్రముఖి తన బందీగా ఉంటున్న గది తలుపులు తెరుచుకుని వేంకటపతి రాజాపై పగ తీర్చుకోవటానికి ప్రయత్నించి విఫలమైంది.
Chandrababu Arrest: బాబు అరెస్టుపై విశాల్ షాకింగ్ కామెంట్స్
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తన పగ తీర్చుకోవటానికి చంద్రముఖి మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ చెబుతున్నారు. ఓ వైపు హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో చంద్రముఖి 2 అలరించనుందని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. ఇక సెప్టెంబర్ 24న ‘చంద్రముఖి 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్స్ యువీ మీడియా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వై.జి.మహేంద్రన్ రావు రమేష్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు, టి.ఎం.కార్తీక్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?