Chandrabose Speech At Naa Saami Ranga Pre Release Event: నా సామి రంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ మైక్ హైజాక్ చేశాను సారీ అంటూ సుమకు సారీ చెప్పారు. తర్వాత కీరవాణి, చంద్రబోస్ ఇద్దరినీ వేదిక మీదకు ఆయన ఆహ్వానించారు. కీరవాణి గారు, చంద్రబోస్ గారు మీరు ఇక్కడికి వచ్చినందుకు థాంక్స్ అన్నారు. ఏ ఈవెంట్ కి అయినా ఆ వేదికకి ఇంపార్టెన్స్ రావాలంటే వచ్చే గెస్ట్ లను బట్టి ఉంటుందని అన్నారు. వీరు సామాన్యులు కాదు తెలుగు ఇండస్ట్రీ ని తీసుకువెళ్లి ఆస్కార్ వేదిక పెట్టి మీద నిలబెట్టిన ఘనత వీరిద్దరికే చెందుతుంది. కీరవాణి గారిని చంద్రబోస్ గారిని ఆహ్వానించడం ఈ స్టేజి మీదకి నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను వారిద్దరూ నా సామిరంగా సినిమాకి పని చేశారు. అది నా సామిరంగా సినిమా చేసుకున్న అదృష్టం.
Naa Saami Ranga : అల్లరి నరేష్ పాత్ర తో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?
ఎన్నో సినిమాలు కీరవాణి గారితో చేశాను కానీ ఇలా వేదిక మీదకు పిలిచే అవకాశం దక్కలేదన్నారు. ఇక సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ కొత్త టెక్నీషియన్లను గుర్తించి వారికి సపోర్ట్ ఇచ్చే నాగార్జున గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. అని అంటూ వేదిక మీదకు నాగార్జున, అల్లరి నరేష్ ఇద్దరినీ పిలిపించి ఫ్రెండ్షిప్ సాంగ్ పాడించారు. ఇక ఆ తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ మా ఇద్దరినీ స్టేజ్ మీదకు నాగార్జున గారు ఆహ్వానించడమే పెద్ద గౌరవం అన్నారు. అలా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్నారు. 28 సంవత్సరాలుగా నన్ను నా ప్రతిభను ప్రోత్సహిస్తూ తనతో పాటు నా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన కీరవాణి గారికి మనస్పూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నానంటూ పాదాల మీద పడ్డారు. ఎన్నో పాటలు నా చేత రాయించి అనుక్షణం మన ప్రోత్సహిస్తున్న నా అన్న లాంటి కీరవాణి గారు నా జీవితంలో లభించడం నా అదృష్టం. ఈ సినిమాలో కీరవాణి గారి స్వర సహకారంతో నాలుగు అద్భుతమైన పాటలు రాశాను చాలా మంచి పాటలుగా విని మిగిలిపోతాయి అని పేర్కొన్నారు.